పట్టపగలు మహిళా టీచర్‌ కిడ్నాప్‌ !

Telugu Lo Computer
0

ర్ణాటకలో హసన్ జిల్లాలో పట్టపగలే మహిళా టీచర్‌ను కొందరు కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఎస్‌యూవీలోకి నెట్టి అపహరించారు. ఒక స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న 23 ఏళ్ల అర్పిత గురువారం సెలవు సందర్భంగా మూసి ఉన్న ఆ స్కూల్‌ బయట ఉంది. ఒక ఎస్‌యూవీ మెల్లగా ఆమె వద్దకు వచ్చింది. సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆ వాహనంలోకి ఎక్కించారు. కేకలు వేస్తున్న ఆమెను కిడ్నాప్‌ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అర్పిత కిడ్నాప్ వెనుక బంధువైన రాము ప్రమేయం ఉన్నట్లు ఆమె తల్లి చెప్పిందన్నారు. వారిద్దరి మధ్య నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్లుగా తెలిసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)