మహిళను గ్యాంగ్ రేప్ చేసిన దొంగలు !

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్‌ లోని బిజ్నోర్‌లో హార్డ్‌వేర్-పేయింట్ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తన తల్లి, పిల్లలతో కలిసి మెడిసిన్స్ కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లిన సమయంలో ఐదుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అల్మారాలను పగలగొట్టి బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, రూ. 1.5 లక్షల విలువైన నగదును దోచుకున్నారు. మహిళను ఓ గదిలో బంధించి ఇంట్లోని స్కూటర్‌ని తీసుకుని పరారయ్యారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇంటి పైకప్పు నుంచి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యను కొట్టడవంతో పాటు ఆమెను బంధించి, స్పృహ తప్పేలా చేశారని, సామూహిక అత్యాచారం చేసి, సిగరెట్లతో కాల్చారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మహిళను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మూడు టీంలతో నిందితులను పట్టుకునేందుకు వెతుకుతున్నట్లు ఎస్పీ రామ్ అర్జ్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)