ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీపావళి పండుగ బోనస్ గా ఒక్కొక్కరికి రూ.7 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. దాదాపుగా 80 వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం రూ.56 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. నాన్-గెజిటెడ్, గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా ఏడు వేల రూపాయలు బోనస్ ఇస్తున్నామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కేజ్రీవాల్ దీపావళి బోనస్ !
November 06, 2023
0
Tags