దీపావళి కానుకగా ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ !

Telugu Lo Computer
0


మిళనాడులోని టీ ఎస్టేట్ కంపెనీ తన ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను అందించింది. తమ యజమాని అందించిన గిఫ్టుతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీలగిరి జిల్లాలోని కోటగిరి పట్టణంలోని టీ ఎస్టేట్ తన ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఉద్యోగులకు బైక్ కీలు అందిస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది. 42 ఏళ్ల టీ ఎస్టేట్ యజమాని శివకుమార్ కూడా తన ఉద్యోగులతో కొత్త బైకులపై జాయ్ రైడ్‌కి వెళ్లారు. దీనిపై ఉద్యోగులు మాట్లాడుతూ  తాము ఇలాంటి గిఫ్టులను ఎప్పుడూ ఆశించలేదని, మా యజమాని 15 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్ని కానుకగా ఇచ్చారని, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)