స్వాప్‌ పార్టీ చేసుకున్నందుకు 23 మంది అరెస్టు !

Telugu Lo Computer
0


చెన్నై సమీపం ఈసీఆర్‌ రోడ్డులో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేందుకు  ఓ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. అనంతరం అందరూ ఫాంహౌస్‌ కు వెళ్లి పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. అయితే పార్టీలో పాల్గొన్న 8 మంది మహిళలను, 15 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు వ్యక్తులు చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డుపై పనైయూర్‌ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌ను పార్టీ కోసం ఈ నెల 4, 5 తేదీల్లో బుక్‌ చేసుకున్నారు. అనంతరం బుక్‌ చేసుకున్న తేదీలలో 8 మంది మహిళలు, 15 మంది పురుషులు ఆ ఫాంహౌస్‌ కు వచ్చి “స్వాప్‌ పార్టీ” చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ శబ్దంతో పాటలు పెట్టుకుని గంజాయి, మద్యం తదితర మత్తుపదార్థాలు తాగిన మత్తులో మహిళలను మార్చుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ విషయం పైన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తనికీలు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. శనివారం చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డుపై పనైయూర్‌ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్‌ లో నిర్వహించిన స్వాప్‌ పార్టీ లో పాల్గొన్న 8 మంది మహిళలను, 15 మంది పురుషులను అరెస్టు చేశామని.. కాగా నిందితులను విచారించగా కోవై జిల్లా మేట్టుపాళ్యానికి చెందిన సెంథిల్‌కుమార్‌ అతని భార్య 2018 నుంచి స్వాప్‌ పార్టీలు నిర్వహిస్తున్నారని, వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మహిళలని సామాజిక మాధ్యమం ద్వారా వల వేసి పట్టుకుని వాళ్ళతో స్వాప్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది అని పేర్కొన్నారు. అలానే సెంథిల్‌కుమార్‌ అతని భార్య పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)