మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ నెటిజన్లు ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇటీవల జరిగిన మేనెజ్ మెంట్ మీటింగ్‌నకు సంబంధించిన ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కంపెనీకి సంబంధించిన అధికారిక సమావేశంలో, డ్రెస్ కోడ్ లాంటివేమీ పాటించకుండా షర్ట్ లేకుండా పాల్గొన్నాడు. అంతేకాదు మసాజ్ కూడా చేయించుకుంటూ ఈ మీటింగ్‌లో పాల్గొనడంతో నెటిజన్లు మండి పడ్డారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. టోనీ ఫెర్నాండెజ్ లింక్డిన్ పోస్ట్ ప్రకారం "ఈ వార్తం చాలా ఒత్తిడితో సాగింది. దీన్నుంచి రిలాక్స్ అయ్యేందుకు వెరానిటా యోసెఫిన్ మసాజ్ చేయించుకోమని సజెస్ట్ చేసింది. ఇండోనేషియా, ఎయిర్‌ఏషియా కల్చర్ అంటే నా కిష్టం..మసాజ్ చేయించుకుంటూ కూడా మేనేజ్‌మెంట్ మీటింగ్ జరుపుకోవచ్చు'' అంటూ రాసుకొచ్చాడు. కంపెనీ వృద్ధిని సాధిస్తోందని, కంపెనీకి సంబంధించిన క్యాపిటల్‌ను కూడా ఖరారు చేశానని తెలిపారు. ముందున్నవన్నీ మంచిరోజులే. చక్కటి కంపెనీని నిర్మించినందుకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఇదేం కల్చర్ అయ్యా సామీ అంటూ రకరకాల కామెంట్లతో అతనిపై విరుచుకు పడుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదని ఒకరు, అతనిని వెంటనే పదవీ నుంచి తొలగించాలంటూ మరొక యూజర్ ఎయిర్‌ఏసియా సీఈవో తీరును విమర్శిస్తున్నారు. "ఎయిర్ ఏషియాలో ఓపెన్ కల్చర్ ఉందని టోనీ అంటే.. ఇంత ఓపెన్ అని అసలు ఊహించలేదు ఇంకొకరు కమెంట్ చేశారు. అయితే కొందరు పాజిటివ్ కూడా స్పందించారు.ఎవరో సీఈవో లింక్డిన్ అకౌంట్‌ను హ్యాక్ చేసి చేసి ఉంటారని ఒకరు వ్యాఖ్యానించగా.. ఇప్రెస్సివ్ అంటూ మరికొందరు ప్రశంసించడం గమనార్హం.
ఓపెన్ కల్చర్ అంటే ఇదా !
October 17, 2023
0
Tags