మోనో సైకిల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని సూరత్‌లో ఓ స్పెషల్ మోనోసైకిల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ మోనో సైకిల్‌ను ఓ పెద్దాయన ఎంతో ఉత్సాహంగా నడుపుతున్నాడు. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఆ వాహనాన్ని వింతగా చూసారు. ఈ ప్రత్యేక వాహనాన్ని ఏ బ్రాండ్ తయారు చేసింది? పబ్లిక్ రోడ్లపై దీనిని నడపడానికి రైట్స్ ఉన్నాయా? ఇవి మాత్రం క్లారిటీ లేదు. iamsuratcity and iamsuratcitynews అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మెన్ ఇన్ బ్లాక్ ఫ్రాంచైజీలో K, J ఉపయోగించే గైరో సైకిల్ వాహనాన్ని ఈ మోనోసైకిల్ గుర్తు తెచ్చిందని చాలామంది నెటిజన్లు స్పందించారు. ఇక కొందరైతే వర్షం వచ్చినప్పుడు బురద నీరంతా తలపైకి వెళ్తుంది అంటూ కామెంట్లు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)