రాత్రికి రాత్రి బస్ షెల్టర్ మాయం !

Telugu Lo Computer
0


బెంగళూరు నగరంలో అసెంబ్లీకి కూత వేటు దూరంలో కన్నింగ్‌హామ్ రోడ్‌లో వారం క్రితం బస్ షెల్టర్ ను ఏర్పాటు చేశారు. లింగరాజపురం, హెన్నూరు, బాణసవాడి, పులకేశినగర్, గంగేనహళ్లి, హేబల్, యలహంక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ బస్ షెల్టర్ ను రూ.10 లక్షలతో నిర్మించారు. అయితే షెల్టర్‌ను ఏర్పాటైన వారం రోజులకే దొంగలు చోరీ చేశారు. బెంగుళూరు నగరంలో బస్ షెల్టర్లు నిర్మించేందుకు బస్ షెల్టర్ చోరీపై బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఓ కంపెనీకి పనులు అప్పగించింది. అయితే బస్ షెల్టర్ చోరీపై కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిరెడ్డి సెప్టెంబర్ 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ షెల్టర్‌ను ఆగస్టు 21న ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ కంపెనీ ఉద్యోగులు ఆగస్టు 28న ఈ షెల్టర్‌ని చూసేందుకు వెళ్లగా అక్కడికక్కడేమీ కనిపించలేదు. కన్నింగ్ హామ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ మొత్తాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నమోదు చేశారు. బెంగుళూరులో ఈ ఏడాది మార్చిలోనూ ఓ బస్టాండ్ రాత్రిపూట అదృశ్యమైంది. హెచ్ఆర్బీఆర్   లేఅవుట్ దగ్గర గల మూడు దశాబ్దాల నాటి బస్టాండ్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్టాప్ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్‌ లేఅవుట్‌ 3వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్‌ ను దొంగలు ఎత్తుకెళ్లారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)