మధ్యప్రదేశ్ రేవాకు చెందిన ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి భోపాల్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అయితే, ఇంట్లో ఉన్న నగలను వెంట తీసుకెళ్లడం సేఫ్ కాదని భావించి, వాటిని ఎక్కడ పెట్టాలబ్బా అని ఆలోచించాడు. సేఫ్ ప్లేస్‌లో వాటిని దాచాలనుకున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లు టూర్‌కు బయల్దేరే ముందు ఇంట్లోని రూ.12లక్షల విలువైన నగలను ఓ పెట్టెలో పెట్టి డస్ట్ బిన్‌లో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు. అయితే, అనుకోకుండా మున్సిపల్ కార్మికులు ఆ చెత్త డబ్బాను వ్యర్థాలు సేకరించే ట్రక్కులోకి వేసేశారు. ఆ చెత్తనంతా డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ట్రిప్ ముగించుకొని వచ్చిన ప్రమోద్ కుమార్ నగల పెట్టె కోసం వెతకగా అది కనిపించలేదు. దీంతో దాన్ని ఎవరో దొంగలించారని ముందు భావించాడు. అయితే, ఆ తర్వాత తెలుసుకుని చెత్త నిర్వహణ సంస్థను ఆశ్రయించాడు. జరిగిందంతా వారికి వివరించాడు. దీంతో వారు రంగంలోకి దిగి చెత్త సేకరణ కార్మికులు, సిబ్బందితో కలిసి రీసైక్లింగ్ ప్లాంట్‌లో కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. చివరికి ఆ విలువైన పెట్టెను గుర్తించి ప్రమోద్ కుమార్‌కు అప్పగించారు.
బంగారు నగలను చెత్త బుట్టలో పెట్టి ఊరెళ్ళిన వ్యక్తి !
October 21, 2023
0
Tags