శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నామినేషన్ దాఖలు !

Telugu Lo Computer
0

ధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బుధ్ని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. బుధ్ని నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. నామినేషన్‌ల దాఖలుకు ఆఖరి రోజైన అక్టోబర్‌ 30న ఆయన నామినేషన్‌ వేశారు. అదేవిధంగా బీజేపీకి చెందిన మరో సీనియర్‌ నేత కైలాష్‌ విజయవర్గీయ కూడా ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండోర్‌-1 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నాడు.  మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్‌ 17న ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం ఈ నెల 21న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ రోజు నుంచి నామినేషన్‌ల దాఖలు మొదలైంది. అక్టోబర్‌ 30 నామినేషన్‌ల దాఖలుకు తుది గడువు. అక్టోబర్‌ 31 దాఖలైన నామినేషన్‌లను స్క్రూటినీ చేయనున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్‌ 2. నవంబర్‌ 17న పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)