రాజస్తాన్‌కి చెందిన మనాలి గుప్తా తన కుమార్తెను స్కూల్ నుండి తీసుకురావడానికి ఉబర్‌ను ఆశ్రయించింది. ఉబర్ ఎక్కిన తర్వాత ఆమె ఫోన్ మాట్లాడుతుండగా డ్రైవర్ ఒక్కసారిగా ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడట!. ప్రతిఘటించబోయిన ఆమెను ధూషించాడట. కారు ఆపమని అరుస్తున్నా కారును మరింత వేగంగా నడిపాడట. కదులుతున్న కారు నుండి దూకడం తప్ప వేరే మార్గం లేక మనాలి కారునుంచి దూకేసారట. డ్రైవర్ కారుతో పాటు పరారయ్యాడట. ఈ ఘటనపై ఉబర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా తనకు స్పందన రాలేదని మనాలి తను షేర్ చేసిన వీడియోలో చెప్పారు. ఉబర్ డ్రైవర్ పేరు శ్యామ్ సుందర్ అని కారు వివరాలను కూడా మనాలి వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటనపై తనకు సపోర్ట్ చేయమంటూ మనాలి నెటిజన్లను రిక్వెస్ట్ చేసారు. వీడియో వైరల్ కావడంతో మనాలికి మద్దతు పలికిన నెటిజన్లు ఉబర్‌ను నిషేధించమంటూ ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై ఉబెర్ స్పందించాల్సి ఉంది. మరోవైపు ప్రైవేట్ క్యాబ్స్ ఆశ్రయించినప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
మహిళపై ఉబర్ డ్రైవర్ వేధింపులు !
October 05, 2023
0
Tags