వందే భారత్ రైలు ట్రాక్‌పై వరుసగా పేర్చిన రాళ్లు - అత్యవసరంగా నిలిపివేత !

Telugu Lo Computer
0


రాజస్తాన్‌లోని భిల్వారా రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం ఉదయం 7.50 గంటలకు ఉదయ్‌పూర్‌-జైపూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉదయ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలు దేరింది. ఉదయం 9.55 గంటల సమయంలో గంగారార్-సోనియానా సెక్షన్‌లోని రైల్వే ట్రాక్‌పై వరుసగా రాళ్లు పేర్చి ఉండటాన్ని లోకో పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి వందే భారత్‌ రైలును నిలిపివేశారు. కిందకు దిగి రైలు పట్టాలపై ఉన్న రాళ్లును గమనించి వాటిని తొలగించారు. రైల్వే ట్రాక్‌ జాయింట్‌ వద్ద రాళ్లతోపాటు రాడ్లు ఉండటం చూసి షాక్‌ అయ్యారు. మరోవైపు రైలు పట్టాలపై ఉన్న రాళ్లు, ఇనుప రాడ్ల ఫొటోలు తీసిన తర్వాత లోకో పైలట్లు వాటిని తొలగించారు. దీని గురించి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌పై వరుసగా రాళ్లు, అడుగు పొడవున్న ఇనుప రాడ్లు అమర్చడంపై రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)