గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం డాకోర్ ప్రాంతంలో రహదారిపై వెళ్తున్న కారు ఉన్నట్టుండి టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను అది ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కారు బోల్తాపడి రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆ రోడ్డుపై వెళ్లిన బైకర్‌ను అది ఢీకొట్టబోయింది. అయితే ఆ వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, గమనించిన పలు వాహనదారులు కారు డ్రైవర్‌ను కాపాడారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. మరోవైపు ఆ ప్రాంతంలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవీలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా !
October 07, 2023
0
Tags