టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల డీఏ పెంపు

Telugu Lo Computer
0


కేంద్రం డీఏను పెంచకముందే తెలంగాణ ప్రభుత్వం డీఏ పెంపును తాజాగా ప్రకటించింది. దసరా కానుకగా ఫెస్టివల్ బొనాంజా పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపును ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ డీఏ పెంపును ప్రకటించారు. 4.8 శాతం డీఏను పెంచుతున్నట్టు ఆయన వెల్లడించారు. డీఏ పెంపు ఈ సంవత్సరం జులై నుంచి అమలులోకి రానుంది. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ జీతంతో పాటే డీఏ కూడా పెరుగుదల రానుంది. 2019 నుంచి ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 9 డీఏలను ఇన్‌స్టాల్‌మెంట్స్ లో ఇస్తున్నారు. అక్టోబర్ జీతంతో పెరిగిన డీఏను కూడా కలిపి ఉద్యోగులకు దసరా కానుకగా పెరిగిన జీతం అందిస్తాం అని సజ్జనార్ చెప్పుకొచ్చారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. దసరా తర్వాత దీపావళికి కేంద్ర ప్రభుత్వ డీఏ పెంపు ప్రకటనను వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డీఏ పెంపుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. ఈసారి 3 లేదా 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)