గన్‌తో టీచర్‌పై కాల్పులు జరిపిన విద్యార్థులు !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్‌లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ సెంటర్‌లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్‌ను బయటకు పిలిచారు. వెంట తెచ్చిన గన్‌తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్‌ గాయమైన టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు విద్యార్థులు తాము గ్యాంగ్‌స్టర్లమని నినాదాలు చేశారు. ఇక, ఆ యువకులు.. టీచర్‌పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. మరోవైపు టీచర్‌ కాలుపై కాల్పులు జరిపి పారిపోయిన విద్యార్థులు అనంతరం ఒక రీల్‌ చేశారు. వీడియోలో 'ఆరు నెలల తర్వాత తిరిగి వస్తా. ఆ టీచర్‌ను 40 సార్లు కాల్చుతా, ఇంకా 39 బుల్లెట్లు మిగిలి ఉన్నాయి' అని ఒక విద్యార్థి అందులో పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. టీచర్‌పై కాల్పులతోపాటు బెదిరింపు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)