భారత వైమానిక దళానికి కొత్త జెండా !

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌, బ్రమౌలలీ సెంటర్‌ ఎయిర్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్‌ఫోర్స్‌ డే సందర్భంగా భారత వైమానిక దళం కొత్త ఫ్లాగ్‌ను ఆవిష్కరించింది. వైమానిక దళాన్ని 8 అక్టోబర్‌ 1932లో స్థాపించారు. అయితే, 72 సంవత్సరాల తర్వాత వైమానిక దళం ఫ్లాగ్‌ను మార్చడం విశేషం, అయితే, ఎయిర్‌ఫోర్స్‌ ఇంతకు ముందు రాయల్‌ ఫోర్స్‌ పేరుతో పిలిచారు. ఆ తర్వాత రాయల్‌ ఇండియర్‌ ఎయిర్‌ ఫోర్స్‌గా నామకరణం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950లో రాయల్‌ అనే పదాన్ని తొలగించి ఇండియర్‌ ఎయిర్‌ఫోర్స్‌ పేరును పెట్టారు. అదే సందర్భంలో ఫ్లాగ్‌ను సైతం మార్చారు. తాజాగా మరోసారి ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లాగ్‌ను మార్చడం విశేషం. ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళం 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కొత్త జెండాను ఆవిష్కరించారు. సెంట్రల్ ఎయిర్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ బమ్రౌలీలో ఏర్పాటు చేసిన ఎయిర్ ఫోర్స్ పరేడ్ తర్వాత ఎయిర్ ఫోర్స్ కొత్త జెండాను ఆవిష్కరించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లాగ్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జెండాను వైమానిక దళం విలువలు, సేవలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఫ్లాగ్‌ను ఆవిష్కరించిన తర్వాత పాత ఫ్లాగ్‌ను ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌కు అందజేశారు. ఆ ఫ్లాగ్‌ను ఎయిర్‌ఫోర్స్‌ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత కొత్త ఫ్లాగ్‌ను వైమానిక దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ Mi-17V5 వినువీధుల్లో ఎగురవేసింది. ఫ్లాగ్‌ పూర్తిగా నీలం కలర్‌లో ఉంటుంది. మధ్యలో జాతీయ చిహ్నంలోని మూడురంగులు వృత్తాకారంలో ఉంటాయి. ఒక జాతీయ జెండాను సైతం ఏర్పాటు చేశారు. ఎయిర్‌ఫోర్స్‌లోగోను సైతం ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)