ఇజ్రాయెల్‌ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకొస్తాం !

Telugu Lo Computer
0


జ్రాయెల్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి అన్నారు. ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. 'ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రధాన మంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ దేశంలో చిక్కుకుపోయిన మన విద్యార్థులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని' ఏపీ పర్యటనలో ఉన్న ఆమె తెలిపారు. గతంలోనూ ఆంధ్రప్రదేశ్  సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చిక్కుకుపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. ఆ సమయంలో ఆపరేషన్‌ గంగ, వందేభారత్‌ తదితర ఆపరేషన్లు చేపట్టి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న విద్యార్థులతో నేరుగా టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని కచ్చితంగా తెలుసుకుంటోందన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ఇదివరకే అడ్వైజరీ జారీ చేసింది. భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)