రిలయన్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల కోసం మార్చుకోదగిన బ్యాటరీలు !

Telugu Lo Computer
0


రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిసారిగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం మార్చుకోదగిన బ్యాటరీలను బుధవారం ప్రదర్శించింది. దీనికి తోడు ఇవి మల్టీపర్పస్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీని కలిగి ఉంటాయని, ఎలక్ట్రిక్ వాహనాల కోసం తన క్లీన్ ఎనర్జీ లక్ష్యాల్లో భాగంగా వీటిని తెచ్చినట్లు వెల్లడించింది. అదేవిధంగా ఇళ్లలో వినియోగించే ఇన్వెర్టర్లకు సైతం తొలిసారిగా మార్చుకోదగిన బ్యాటరీ సాంకేతికతను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నూతన సాంకేతికత ద్వారా ఎవరైనా వ్యక్తి సదరు బ్యాటరీని తమ ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుకునేందుకు వినియోగించుకోవచ్చు. అలాగే అదే బ్యాటరీని ఇంట్లో వస్తువుల కోసం ఇన్వర్టర్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ సరికొత్త బ్యాటరీలను వినియోగదారులు రిలయన్స్ బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లలో మార్చుకోవచ్చు లేదా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించి ఇంటివద్దనే రీ-ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాటరీలు ఎప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్ అభివృద్ధి అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన 10 బిలియన్ డాలర్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం చేస్తున్న గ్రీన్ పుష్‌లో ఒక భాగం. కంపెనీ తన ప్రధాన ఆయిల్ అండ్ కెమికల్స్ వ్యాపారంపై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను భారీగా పెంచుతోంది. ఈ క్రమంలో 2021-22లో UK ఆధారిత సోడియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసే ఫారాడియన్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్  బ్యాటరీలను ఉత్పత్తి చేసే లిథియం వర్క్స్ కంపెనీలను 200 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)