ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో శనివారం భారత సైన్యానికి చెందిన చేతక్ హెలికాప్టర్ ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. శనివారం ఒక సాధారణ శిక్షణా మిషన్‌లో పాల్గొన్న చేతక్ హెలికాప్టర్ ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ ఇంజినీరింగ్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సాంకేతిక తనిఖీలు నిర్వహించింది. ఆ తర్వాత హెలికాప్టర్‌ను తిరిగి ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఈ ఘటన గురించి మాట్డుతూ చేతక్ హెలికాప్టర్ శిక్షణ మిషన్ లో పాల్గొన్న సమయంలో సాంకేతిక లోపాలకు గురైనట్లు అనిపించింది. వెంటనే ముందస్తు జాగ్రత్తగా హెలికాప్టర్ ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. కాగా ఈ ఘటన లో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆర్మీ ఇంజినీరింగ్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సాంకేతిక తనిఖీలు నిర్వహించిందని, అనంతరం హెలికాప్టర్ ని యధావిధిగా శిక్షణ మిషన్ లో ఉపయోగించమని ఆయన తెలిపారు.
ప్రయాగ్‌రాజ్‌లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
October 14, 2023
0
Tags