బ్రిడ్జిపై నుంచి బస్సు పడి 21 మంది పర్యాటకుల మృతి

Telugu Lo Computer
0


టలీలోని  వెనిస్‌ నగరం లో పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది మృతి చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులంతా వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్‌ సైట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల్లో ఇటలీ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు అదుపుతప్పి కింద పడగానే బస్సులోని మీథేన్‌ ఇంధనం లీకై మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని చెప్పారు. బస్సు ప్రమాదంపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)