ఆసియా పారా క్రీడల్లో 111 పతకాలు సాధించిన భారత్ !

Telugu Lo Computer
0

చైనా లోని హాంగ్​జౌ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో ఎన్నడూ లేని విధంగా భారత్ పారా అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. శనివారం నాటికి 100 పతకాల మైలురాయిని అందుకుంది. శుక్రవారం ఇండియా ఖాతాలో 99 పతకాలు ఉన్నాయి. అయితే శతకానికి అడుగు దూరంలో ఉన్న భారత్​కు శనివారం ఉదయం పురుషుల విభాగం 400 మీ టీ47 ఈవెంట్​లో దిలీప్​ స్వర్ణం కైవసం చేసుకోవటం వల్ల 100పతకాలు సాధించిన ఘనతను దక్కించుకుంది. చివరి రోజైన ఈ క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ప్రస్తుతం 111కు చేరుకుంది. ఇందులో 29 బంగారు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో ఇండియా ఐదో స్థానంలో నిలిచింది. 2018 ఇండోనేషియాలో జరిగిన మూడో ఆసియా పారా క్రీడల్లో 15 బంగారు పతకాలు, 24 రజతాలు, 33 క్యాంసాలతో ఇండియా 72 పతకాలను కైవసం చేసుకుంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీడీ శుభాకాంక్షలు తెలిపారు. " ఆసియా పారా క్రీడల్లో భారత్ అథ్లెట్లు గొప్ప ఘనతను సాధించారు. ఈ విజయం మన క్రీడాకారుల కృషి సంకల్పం వల్లనే సాధ్యమైంది. భారత్ 100 పతకాల మైలురాయి అందుకున్నందుకు దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి చారిత్రక విజయాల్ని అందించిన అథ్లెట్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయాలు అందరికీ స్ఫూర్తినిస్తాయి." అని ప్రధాని మోడీ ట్విట్టర్​లో పోస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)