దేశాన్ని ఇబ్బంది పెట్టొద్దు : ఒమర్ అబ్దుల్లా

Telugu Lo Computer
0


తమ కూటమికి ఇండియా పేరు పెట్టడం వల్లే దేశం పేరుని భారత్‌గా మార్చాలని కేంద్రం ఒత్తిడి తెస్తే, తాము తమ కూటమి పేరుని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ''ప్రతిపక్ష పార్టీల కూటమికి ఇండియా పేరు పెట్టడం వల్లే దేశానికి 'భారత్'గా పేరు మార్చాలని కేంద్రం ఒత్తిడి చేస్  మేము మా కూటమి పేరుని మార్చుకుంటాం. కేవలం పేరు కోసం మేము దేశాన్ని ఇబ్బందుల్లో నెట్టాలని కోరుకోవడం లేదు. మేము దేశంపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఒక కూటమిగా ఏర్పడ్డామే తప్ప, భారం పెంచేందుకు కాదు. ఒకవేళ 'ఇండియా' కూటమి వల్లే దేశానికి పేరు మారుస్తున్నారని మాకు ఒక చిన్న సంకేతం అందినా, కూటమి పేరుని వెంటనే మార్చుకుంటాం'' అని ఒమర్ అబ్దుల్లా మీడియాతో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. రాజ్యాంగంలో భారతదేశం, ఇండియా రెండింటినీ దేశం పేర్లుగా పేర్కొన్నారన్న సంగతిని గుర్తు చేశారు. కాబట్టి ఇండియాని తొలగించడం సమంజసం కాదని హితవు పలికారు. "ఇండియా, భారత్.. దేశానికి ఈ రెండు పేర్లను వాడుకోవచ్చని రాజ్యాంగంలో రాసి ఉంది. ప్రధాని మోడీ ప్రయాణించే విమానాన్ని చూస్తే దానిపై భారత్‌తో పాటు ఇండియా అని కూడా రాసి ఉండటాన్ని గమనించవచ్చు'' అని ఒమర్ తెలిపారు. ఒకవేళ ప్రధాని కొన్ని కారణాల వల్ల ఇండియా పేరు వినియోగించుకోకూడదని అనుకుంటే, ఆ పేరుని పక్కన పెట్టేయాలి గానీ.. రాజ్యాంగం నుంచి తొలగించకూడదన్నారు. ఒకవేళ ఇండియా పేరుని తొలగించాలనుకుంటే.. దాన్ని ఎక్కడి నుంచి తొలగిస్తారని ప్రశ్నించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇస్రో, ఐఐటీ, ఐఐమ్, గుర్తింపు కార్డులు ఇలా అన్నింటిలోనూ ఇండియాని భారత్‌గా మారుస్తారా? అని నిలదీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)