భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ను విజయవంతంగా నిర్వహించేందుకు బీసీసీఐ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా టోర్నీకి మరింత ఆదరణ దక్కేందుకు దేశంలోని ప్రముఖులకు గోల్డెన్ టికెట్‌లను అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఇళ్లకు వెళ్లి గోల్డెన్ టికెట్‌ను అందిస్తున్నారు. అగ్ర కథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ ను నేడు జై షా కలిసి వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్‌ను అందజేశారు. స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించాలని రజనీని జైషా కోరారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇటీవల జై షా.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ను కలిసి వన్డే ప్రపంచకప్ గోల్డెన్ టికెట్‌ను అందజేసిన విషయం తెలిసిందే.
రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ !
September 19, 2023
0
Tags