దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పూతుపల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఝార్ఖండ్‌లోని దుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, ధాన్‌పుర్ శాసనసభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఏడు స్థానాల ఉప ఎన్నిక ఫలితాలను సెప్టెంబరు 8వ తేదీన ప్రకటించనున్నారు.
ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
September 05, 2023
0
Tags