రాపిడో బైక్ డ్రైవర్లపై ప్రైవేటు వాహనాల సంఘం సభ్యుల దాడి !

Telugu Lo Computer
0


ర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి పథకానికి వ్యతిరేకంగా ప్రైవేటు వాహనాల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు నానా హంగామా చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి పథకానికి వ్యతిరేకంగా బెంగుళూరు బంద్కు ప్రైవేట్ వాహనాలు అసోసియేషన్లు పిలుపునిచ్చాయి. అయితే తమ బంద్ ను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన రాపిడో బైకర్లు, ఇతర ప్రైవేటు కార్ల డ్రైవర్లపై ప్రైవేటు వాహనాల అసోసియేషన్ల ప్రతినిధులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. బెంగుళూరులోని ఆనంద్ రావ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర నిరసన తెలిపిన ప్రైవేటు వాహనాల అసోసియేషన్ల ప్రతినిధులు బైక్ -టాక్సీ రైడర్‌ను దారుణంగా కొట్టారు. బైకును ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన బైకును పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బైక్ ట్యాక్సీ రైడర్‌పై దాడి చేస్తున్న ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. బెంగుళూరులోని బాణసవాడిలో ఆందోళనకారులు బైక్ టాక్సీ రైడర్‌ను తీవ్రంగా దూషించారు. ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తుండగా..అదే దారిలో బైక్ ట్యాక్సీ డ్రైవర్ వెళ్తున్నాడు. దీంతో అతన్ని ఆపిన నిరసనకారులు..కొట్టారు. బైక్‌ను ధ్వంసం చేసి ప్రధాన రహదారిపైనే పడేశారు. ఆందోళనకారులు బైక్ టాక్సీ రైడర్ హెల్మెట్‌ను కూడా పగలగొట్టారు. పసుపు నంబర్‌ ప్లేట్లు ఉన్న కార్లపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. కార్లను మార్గమధ్యంలో నిలిపివేశారు. ఆ తర్వాత కార్ల డ్రైవర్లకు పూలమాల వేసి వారి ముఖంపై ఉమ్మివేశారు. అలాగే డ్రైవర్‌పై ఉమ్మి వేసిన ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)