బీహార్ లోని బెగుసరాయ్ లో రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ చోరీకి పాల్పడేందుకు స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో రైలులోపల ఉన్న ఎవరో అతడిని చూసి పట్టుకున్నారు. అదే సమయంలో రైలు కదలడం ప్రారంభించింది. తప్పించుకునే దారి లేక దొంగ కిటికీకి వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో ప్రయాణించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, దొంగ క్షమాపణలు చెప్పాడు. దొంగ రైలు కిటికీకి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అలాగే ప్రయాణించాడు. కదులుతున్న రైలులో దొంగ స్వయంగా గ్రిల్ పట్టుకోగా, లోపల ఉన్నవారు కూడా కిందపడకుండా అతడి చేయి పట్టుకున్నారు. బచ్వాడ జంక్షన్‌కు చేరుకునే వరకు అలాగే ప్రయాణం సాగింది. రైలు ఆగిన తర్వాత ప్రయాణికులు దొంగను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అప్పగించారు.
రైల్లో దొంగతనానికి వెళ్లి కష్టాల్లో ఇరుక్కున్న దొంగ !
September 03, 2023
0
Tags