ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

Telugu Lo Computer
0


భారత హరిత విప్లవ పితామహుడు , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ( 98) వృద్ధాప్య సమస్యలతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో తన నివాసంలో కన్నుమూశారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం 1967లో పద్మశ్రీ , 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్‌కు నామినేట్ ఎంపీగా స్వామినాథన్ సేవలందించారు. 1988లో స్వామినాథన్ లాభాపేక్ష లేని రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు, వీరిలో ఒకరైన సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో 2019 నుంచి 2022 వరకు చీఫ్ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాపి కట్టడి కోసం ఎంతో కృషి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)