సౌత్‌ఈస్ట్ ఢిల్లీలోని సరితా విహార్‌లో నివాసం ఉండే అరవింద్ మండల్ తన కొడుకును స్కూల్ నుంచి తీసుకువస్తుండగా, మనోజ్ హల్దర్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. తర్వాత వివాదం సద్దుమణగడంతో అరవింద్ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే రాత్రి 9.30 గంటలకు అరవింద్ ఇంటికి ఆరుగురు వ్యక్తులు బైక్స్‌పై వచ్చారు. అరవింద్‌ను ఇంట్లో నుంచి లాక్కొచ్చి కత్తులతో పొడిచారు. అతని భార్య రేఖా మండల్‌పైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అరవింద్‌ను హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాడి జరిగిన కాసేపటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. వీరంతా సరితా విహార్‌లోనే నివాసం ఉంటారని తెలుస్తోంది.
పార్కింగ్ వివాదం హత్యకు దారితీసింది !
September 17, 2023
0
Tags