అక్షర్‌ధామ్‌లో బ్రిటన్‌ ప్రధాని దంపతుల పూజలు !

Telugu Lo Computer
0


జీ20 సమావేశాల కోసం భారత్‌కు విచ్చేసిన బ్రిటన్‌ ప్రధాని రిషీ సునాక్‌.. ఆదివారం ఉదయం తన సతీమణి అక్షతామూర్తి సునాక్‌తో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అక్షతా సునాక్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 40 నిమిషాలపాటు వారు ఆలయంలో గడిపారు. సునాక్‌ దంపతుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రిషీ సునాక్‌ జీ20 సదస్సుకు విచ్చేసిన ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడ గాంధీ మహాత్ముడికి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా, రిషీ సునాక్‌ దంపతులు అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని దర్శించుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారత సంతతికి చెందిన రిషీ సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌కు విచ్చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)