న్యూఢిల్లీలో ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలో జారిపడటంతో ఆమె కాలు మెలిపడటంతోపాటు విరిగింది. దీంతో ఆ మహిళను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయగా విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారు.56 ఏండ్ల అనూ డోగ్రా సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేందుకు అపార్ట్‌మెంట్ మెట్లపై నుంచి నడిచి కిందకు వచ్చింది. ఇంతలో అక్కడున్న ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఒక కుక్క ఆ మహిళ మీదకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె జారిపడింది. కాగా, కుక్కల దాడిలో గాయపడటంతోపాటు కాలు విరిగిన ఆ మహిళను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విరిగిన కాలును సరిచేసేందుకు సర్జరీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. మరోవైపు ఆ అపార్ట్‌మెంట్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహిళపై వీధి కుక్కలు దాడి !
September 15, 2023
0
Tags