చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు మరో 156 తేలికపాటి ప్రచండ్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత వైమానిక దళం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు ఆర్డర్ ఇవ్వనుంది. భారత వైమానిక దళం, భారత సైన్యం ఇప్పటికే 15 ప్రచండ్ విమానాలను గత కొద్ది నెలలుగా వాడుతూ సంక్లిష్ట వాతావరణ పరిస్ధితుల్లో వాటితో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. 156 ప్రచండ్ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను ఐఏఎఫ్ ఇటీవల ప్రభుత్వం ముందుంచగా త్వరలో గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందని ఆశిస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధ విమానాలను సేకరించాలని యోచిస్తున్నట్టు భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి సైతం ఇటీవల పేర్కొన్నారు. 156 విమానాల్లో 66 విమానాలను ఐఏఎఫ్ కొనుగోలు చేయనుండగా, మిగిలిన 90 విమానాలు ఆర్మీ సేకరిస్తుంది. రెండు ప్రాజెక్టులు కలిపి రూ. 1.5 లక్షల కోట్ల విలువ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
హెచ్ఏఎల్‌కు ఐఏఎఫ్ భారీ ఆర్డర్ ?
September 29, 2023
0
Tags