బోగీల్లో చెత్త ట్రాక్‌ పై పడేస్తున్న సిబ్బంది !

Telugu Lo Computer
0


రైల్వే హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది కదులుతున్న రైలులోని చెత్తను ట్రాక్‌పై పడేస్తున్న వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ఓ నెటిజన్‌ పంచుకున్నాడు. ' స్వచ్ఛ భారత్‌ వైపు అడుగులు వేస్తున్న భారతీయ రైల్వేలు.. అంటూ క్యాప్షన్‌ జోడిస్తూ.. బోగీలలో శుభ్రం చేసిన వ్యర్థాలను (చెత్తను) చెత్త డబ్బాలో వేయాల్సిన సిబ్బందే ట్రాక్‌పై వేయడం ఘోరం. ఇది రైల్వే శాఖ వైఫల్యం. వేల కొద్ది టన్నుల వ్యర్థాలు ప్రతిరోజు ట్రాక్‌లపై ఉంటున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలి' అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో సెంట్రల్ రైల్వే స్పందించింది. ఈ సంఘటన జరిగిన రైలు నంబరు, తేదీని తెలపండి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో సదరు నెటిజన్ దీనికి స్పందిస్తూ..' ఇది అన్ని రైళ్లలో దాదాపు 99 శాతం జరిగే సాధారణ దృశ్యం. మీకు ప్రత్యేకంగా రైలు నంబరు అవసరం లేదు. ఏ రైలులో చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్ని సంచుల చెత్తను సేకరిస్తున్నారని బోగీలను శుభ్రం చేసే సిబ్బందిని ప్రశ్నించండి చాలు ' అంటూ పోస్ట్ పెట్టాడు. మరో నెటిజన్‌ రైలులో క్లీనింగ్‌ సర్వీస్‌ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానా విధించేందుకు రైల్వే శాఖ టీటీఈకి అధికారాలు అప్పగించాలని కోరుతున్నాం ' అంటూ రాసుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)