బీహార్ లోని డొమినియా ఖండలో తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు నెలకొనగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీజ్ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి మహిళలు పూజలు చేసినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున పూజ అనంతరం.. చిన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు డొమినియా ఖండానికి వెళ్లారు. నిమజ్జనం చేసిన తర్వాత స్నానం చేస్తుండగా ఐదుగురు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన అక్కాచెల్లెళ్లు జూలీ కుమారి(10), జ్యోతి కుమారి (8) గా గుర్తించారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటం వలనే వారు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఐదుగురు బాలికలు నీటిలో మునిగిపోతున్నప్పుడు.. ఓ స్థానిక వ్యక్తి చూసి ముగ్గురు బాలికలను రక్షించాడు. మిగతా ఇద్దరిని కాపాడలేకపోయాడు.
విగ్రహ నిమజ్జనంలో అపశృతి : అక్కాచెల్లెళ్లు మృతి
September 19, 2023
0
Tags