అదపుతప్పి గోతిలో పడిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరి జిల్లాలో 60 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది యాత్రికులు గాయపడ్డారు. అల్లీపూర్‌ గ్రామం సమీపంలో బరేలీ-లక్నో జాతీయ రహదారిపై జంగ్‌ బహదూర్‌ గంజ్ బైపాస్‌ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో తీవ్ర గాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం షాజాన్‌పూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో మధుమతి అనే మహిళకు తలకు గాయమైంది. అయితే, క్షతగాత్రులెవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 60 మంది యాత్రికులు గయా, బోధ్‌గయా, ప్రయాగ్‌రాజ్‌, చిత్రకూట్‌, బృందావన్‌, హరిద్వార్‌ పర్యటనలు పూర్తిచేసుకుని అయోధ్య, వారణాసికి వెళ్తూ ప్రమాదం బారినపడ్డారని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)