ఉగ్రవాదుల దాడిలో సైనికుడిని రక్షించే సమయంలో ఇండియన్ ఆర్మీకి చెందిన కెంట్ అనే ఆరేళ్ల శునకం ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్ అపరేషన్ చేపడుతున్న బృందం కెంట్‌ను తీసుకువెళ్లింది. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 'ఆపరేషన్ సుజలిగాల'లో భాగంగా ఒక దట్టమైన పొద దగ్గర సైనికుల బృందం కెంట్‌ను అనుసరిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులను పసిగట్టిన శునకం సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అయితే.. ఇరువర్గాల మధ్య భారీగా కాల్పుల జరిగాయి. ఈ నేపథ్యంలో ఓ సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో కెంట్ వారికి ఎదురుగా వెళ్లింది. భారీ కాల్పుల మధ్య ఆ శునకం తీవ్రంగా గాయపడి మరణించింది. కెంట్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారతీయ రక్షణ శాఖ ఎక్స్(ట్విటర్)లో నివాళుల అర్పిస్తూ.. 'ఇది ఎంతో విచారకరమైన వార్త.. 21వ ఆర్మీ డాగ్ యూనిట్‌లోని లాబ్రడార్ జాతికి చెందిన ఆడ శునకం (కెంట్) తన సైనికుడి ప్రాణాలను రక్షించే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసింది. దేశం కోసం చేసిన గొప్ప త్యాగం ఇది' అని పేర్కొంది.
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన శునకం
September 13, 2023
0
Tags