ఉత్తరప్రదేశ్ కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ శుక్లా కి చెందిన మీడియా విభాగంలో శ్రేష్ట తివారీ(23) అనే యువకుడు పని చేస్తున్నాడు. అతను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వారిరువురికి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఎమ్మెల్యే నివాసంలో ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. తాను చనిపోతున్నట్లు హెచ్చరిస్తూ ఆమె ముందే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు పోలీసులకు సమాచారం అందించింది.యువకుడు సూసైడ్ చేసుకున్న గది తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ప్రియురాలి ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఆత్మహత్య !
September 25, 2023
0
Tags