ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఇజిఐ)కి వ్యతిరేకంగా మణిపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డియుజె) తీవ్రంగా ఖండించింది. ఈ ఎఫ్ఐఆర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మణిపూర్లో సుమారు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న హింసాకాండపై ఇజిఐ నిజ నిర్ధారణ బృందం ఇటీవల 24 పేజీలతో కూడిన ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదికను సవాల్ చేస్తూ ఒక స్థానిక సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఈ బృందంలోని సభ్యులు సీమా గుహ, సంజరుకపూర్, భరత్ భూషణ్తో పాటు ఇజిఐ అధ్యక్షులు సీమా ముస్తాఫాపై ఎఫ్ఐఆర్ నమోదయింది. తటస్థ నిపుణులతో కూడిన ఇజిఐ ఇచ్చిన నివేదిక పక్షపాతమని ఆరోపించడం అసంబద్ధమని డియుజె తన ప్రకటనలో ఖండించింది.
ఎడిటర్స్ గిల్డ్పై ఎఫ్ఐఆర్ రద్దు చేయండి !
September 06, 2023
0
Tags