విప్రో కంపెనీ చెన్నై ఆస్తుల అమ్మకం !

Telugu Lo Computer
0


విప్రో కంపెనీ చెన్నై నగరంలో తమకున్న 14 ఎకరాల్లో ఉన్న బిల్డింగ్ తోపాటు, స్థలం మొత్తాన్ని అమ్మేసింది. 266 కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకుంది. విప్రో కంపెనీ చెన్నైలోని తన 14 ఎకరాల క్యాంపస్ అమ్మేయటం చర్చనీయాంశం అయ్యింది. చెన్నైలోని 20 ఏళ్ల క్రితం నుంచే ఈ స్థలం విప్రో దగ్గర ఉంది. ఈ 14 ఎకరాల భూమిలో ఓ పెద్ద పాత భవనం కూడా ఉంది. ఇప్పుడు ఈ 14.2 ఎకరాల భూమిని రూ. 266.38 కోట్లకు విక్రయించినట్లు ప్రకటించింది. ఈ ఆస్తులను కాసా గ్రాండ్ బిజ్‌పార్క్ అనే ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. ఈ ఆస్తి చెన్నైలోని షోలింగనల్లూర్‌లోని విప్రో స్ట్రీట్‌లో ఉంది. ఈ ఆస్తుల విక్రయం జరిగిన అనంతరం విఫ్రో షేర్లు వరుస నష్టాలను చవిచూశాయి. మరో విశేషం ఏంటంటే ఈ స్థలం ఉన్న ఏరియాతోపాటు ఆ వీధికి విప్రో స్ట్రీట్ అనే పేరుంది. అంత పాపులర్ ఇది. విప్రో అలాంటి అంతర్జాతీయ సంస్థ  చెన్నై లాంటి మహానగరంలోని 14 ఎకరాల భూమిని అమ్మటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి ఆలోచనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా వచ్చింది. దీంతో సెప్టెంబర్ 26వ తేదీ ట్రేడింగ్ లో విప్రో షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐదు రోజుల్లోనే 5 శాతం నష్టపోయాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)