వాట్సాప్ ఛానల్లో మోడీకి 5 మిలియన్ల ఫాలోవర్స్ !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఆయన్ను సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలో అవుతుంటారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటిల్లో ప్రధాని మోడీని కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అటు వాట్సాప్ లోనూ మోదీ హవా మామూలుగా లేదు. ఇటీవలే ప్రధాని మోడీవాట్సాప్ లో తన పేరు మీద ఓ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానెల్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే 1 మిలియన్ మంది ఫాలో అయ్యారు. తాజాగా ఈ సంఖ్య 5 మిలియన్లకు చేరుకోవడం విశేషం. దీంతో సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్ ఫాంలలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న భారత రాజకీయ నేతగా ప్రధాని మోడీ నిలిచారు. వాట్సాప్ ఛానెల్ లో తన ఫాలోవర్ల సంఖ్య 5 మిలియన్లకు చేరుకోవడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ప్రత్యేక మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. వాట్సాప్‌ ఛానెల్‌తో ప్రజలంతా తనతో అనుసంధానమైనందుకు ఎంతో గొప్పగా భావిస్తున్నానని మోడీ తెలిపారు. నిరంతరం జనం అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు చెప్పారు. వాట్సాప్ ద్వారా ప్రజలతో సంభాషణలు కొనసాగిస్తుందన్నందుకు ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం.. అని ప్రధాని మోడీ వాట్సాప్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)