జమ్మూ కాశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా దళాల యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సుమారు 50 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్‌నాగ్ ఏరియాలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా వేట కొనసాగిస్తున్నారు. కోకెర్‌నాగ్‌లో ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి బుధవారం నుంచి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆఫీసర్ కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. లష్కరే తోయిబాకు ప్రత్యామ్నాయం అయిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద దళం ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. కోకెర్‌నాగ్ ప్రాంతంలో సుమారు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గారోల్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో హీరన్ డ్రోన్లతో పాటు క్వాడ్‌కాప్టర్లను .. నిఘా కోసం రంగంలోకి దింపారు.
50 గంటలుగా కొనసాగుతున్న యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ !
September 15, 2023
0
Tags