భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 5 కోట్ల సాయం ప్రకటించారు. ఈ మేరకు నితీష్‌కుమార్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖుకి బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో జరిగిన ప్రాణ మరియు ఆస్తినష్టం పట్ల ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. '' మీ సమర్థ నాయకత్వం, మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రజలు త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం '' అని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటంతో సుమారు 400 మంది ప్రజలు మరణించగా, సుమారు 13,000కుపైగా నివాసాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రూ.12,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్‌కు బీహార్ రూ. 5 కోట్ల సాయం !
September 13, 2023
0
Tags