2035 నాటికి 42.5 కోట్లకు విమాన ప్రయాణికులు

Telugu Lo Computer
0


దేశంలో 2035 నాటికి విమాన ప్రయాణికుల సంఖ్య 42.5 కోట్లకు చేరవచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం ఈ సంఖ్య 14.5 కోట్లుగా ఉందని అన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు దృష్టి సారించేలా విమానయాన రంగం అభివృద్ధి సాధించిందని అన్నారు. కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సిఐఐ) శుక్రవారం గ్వాలియర్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఏరోస్పేస్‌ కాన్ఫరెన్స్‌లో సింథియా మాట్లాడుతూ ప్రాంతీయ కనెక్టివిటీ ప్రజల విమాన ప్రయాణాన్ని సులభతరం చేసిందని అన్నారు. ప్రస్తుతం నాలుగు ప్రాంతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా దేశ పౌర విమానయాన రంగం సాధించిన సామర్థాన్ని ప్రశంసించారు. అలాగే అంతర్జాతీయ క్రీడాకారులు భారత్‌ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. పౌర విమానయానాన్ని సేవగా, ఉత్పత్తిగా వృద్ధి చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. జులైలో దేశీయ విమానాల రాకపోకలు 25 శాతం పెరిగి 1.21కోట్ల మంది ప్రయాణికులకు చేరుకున్నట్లు అధికారిక సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)