ఆంధ్రప్రదేశ్ లో వార్డు గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. నాలుగేళ్ల క్రితం సచివాలయాల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లుగా నియమితులైన వారిలో కొందరికి ప్రమోషన్లు ప్రకటించారు. హార్టికల్చర్ ఉద్యోగులకు అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి 1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు.వివిధ జిల్లాల్లో కేటగిరి 1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 53 కాళీ ఉండగా వీటిని హార్టికల్చర్ అసిస్టెంట్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పలు శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 రకాల కేటగిరి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 17 రకాల కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో ఆ 17 కేటగిరి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన పదోన్నతులకు నిర్దేశించిన బాధ్యతల్లో ఖాళీలు ఏర్పడగానే ఎప్పటికప్పుడు సచివాలయాల ఉద్యోగులకు అవకాశం దక్కుతుంది. మిగిలిన రెండు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాల ఖరారు తుది దశలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒకటి పాయింట్ 34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పై ఎప్పటికప్పుడు స్పందించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.
సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు !
August 27, 2023
0