మణిపూర్‌లో శనివారం ఉదయం బిష్ణుపూర్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారని పోలీసులు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్తా సమీపంలోని ఉఖ్ఖా తంపఖ్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులు తండ్రీకొడుకులిద్దరు, మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసి చంపారని పోలీసులు శనివారం తెలిపారు. హత్యకు గురైన గ్రామస్తులు నిద్రిస్తున్న సమయంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి, కత్తులతో పొడిచి చంపారని పోలీసులు తెలిపారు. దాడి చేసిన ఉగ్రవాదులు చరచంద్‌పూర్ నుండి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొండలు, లోయల మధ్య, కేంద్ర భద్రతా బలగాలు నిర్వహించబడుతున్న బఫర్‌జోన్‌ను ఉగ్రవాదులు ఉల్లంఘించి.. దాడి చేశారని, ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని పోలీసులు వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి
August 05, 2023
0
Tags