దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లల్లో కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల నియామకాలు జరగట్లేదు. ఖాళీలను భర్తీ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీనిపై రాజ్యసభలో సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిచ్చారు. రైల్వేలో జోన్లవారీగా ఉన్న ఖాళీలపై లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. వాటిని భర్తీ చేయడానికి తగిన చర్యలను తీసుకుంటోన్నామని వివరించారు. ఆర్పీఎఫ్/ఆర్పీఎస్ఎఫ్‌లో చేపట్టాల్సిన రిజర్వేషన్ల కోటాల గురించీ సభ దృష్టికి తీసుకొచ్చారు. లెవెల్-1 పోస్టులు సహా అన్ని రైల్వే జోన్లల్లో గ్రూప్- సీ విభాగంలో 2,48,895 ఖాళీలు ఉన్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. గ్రూప్- ఏ, బీల్లో 2,070 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. గ్రూప్-సీ కేటగిరీలో జోన్లవారీగా ఉన్న ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన వివరాలను అశ్విని వైష్ణవ్ సభ ముందు ఉంచారు. గ్రూప్-సీలో సెంట్రల్- 25,281, ఈస్ట్ కోస్ట్- 8,114, ఈస్ట్ సెంట్రల్- 12,812, ఈస్టర్న్- 29,869, మెట్రో- 993, నార్త్ సెంట్రల్- 15,962, నార్త్ ఈస్టర్న్- 12,830, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్- 12,365, నార్తర్న్- 32,438, నార్త్ వెస్టర్న్- 9,813, సౌత్ సెంట్రల్- 10,338, సౌత్ ఈస్ట్ సెంట్రల్- 7,796, సౌత్ ఈస్టర్న్- 13,432, సదరన్- 15,240, సౌత్ వెస్టర్న్- 4,843, వెస్ట్ సెంట్రల్- 11,142, వెస్టర్న్- 25,597 ఖాళీలు ఉన్నాయి. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లపై మొత్తం 1,28,349 మంది అభ్యర్థులు గ్రూప్ సీ పోస్టులకు తమ పేర్లను ఎంప్యానెల్ అయ్యారు. లెవెల్-1 నోటిఫికేషన్‌పై మొత్తం 1,47,280 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.రైల్వేలో గ్రూప్ ఎ సర్వీసులకు యూపీఎస్సీ ద్వారా నియామకాలు జరుగుతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు.
రైల్వేలో ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడానికి తగిన చర్యలను తీసుకుంటున్నాం !
August 07, 2023
0
Tags