టమాటాల దండతో రాజ్యసభకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ !

Telugu Lo Computer
0


మ్‌ ఆద్మీ పార్టీ  రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్‌ గుప్తా టమాటాల ధర పెరుగుదలపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు టమాటాల దండ ధరించి వచ్చారు. రాజ్యసభలో ఆయన మెడలో టమాటాల దండ చూసి ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుశీల్‌ కుమార్‌ తీరు తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ''పార్లమెంటు సభ్యులుగా మన ప్రవర్తనకు ఒక పరిధి ఉంటుంది. గౌరవ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ గుప్తా సభకు హాజరైన తీరు చూసి రాజ్యసభ ఛైర్మన్‌గా ఎంతో బాధ పడుతున్నా. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రతిపక్ష నాయకుడితో చర్చిస్తా'' అని జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. సుశీల్‌ కుమార్‌ టమాటా దండతో సభకు వెళుతున్న వీడియోను ఆప్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)