కేరళ రాష్టం పేరును కేరళంగా మారుస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం !

Telugu Lo Computer
0


కేరళ తమ రాష్ట్రం పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ పేరును కేరళం అని మారుస్తూ సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అటు కాంగ్రెస్ కూడా ఎటువంటి సవరణలు సూచించలేదు. దీంతో ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ప్రభుత్వం అన్ని అధికారిక రికార్డులలో రాష్ట్రాన్ని కేరళం అని మార్చాలని కోరింది. కేరళను పూర్వకాలం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ''మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ స్వాతంత్య్రానికి ముందే నుంచే ఉంది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని కేరళం అని సవరించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో తక్షణమే మార్పులు చేయాలి'' అని విజయన్‌ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)