అమితాబ్‌ బచ్చన్‌ కి రాఖీ కట్టిన మమతా బెనర్జి

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు రాఖీ కట్టారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనున్న INDIA కూటమి మూడో సమావేశం కోసం మమతాబెనర్జి బుధవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాఖీ కట్టేందుకు బిగ్‌ బీ అమితాబచ్చన్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ అమితాబ్‌కు రాఖీ కట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను భారత్‌ రతన్‌ అమితాబచ్చన్‌ను కలిశాను. ఆయనకు రాఖీ కూడా కట్టాను. ఆయన కుటుంబాన్ని నేను చాలా ప్రేమిస్తాను. దేశంలోని వారిది నంబర్‌ వన్‌ ఫ్యామిలీ. బెంగాల్‌లో జరిగే దుర్గా పూజకు, అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరు కావాలని ఈ సందర్భంగా తాను అమితాబ్‌ను ఆహ్వానించాను' అని మమత తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)