కూతురు చనిపోయిందనుకొని తల కొరివి.....!

Telugu Lo Computer
0


బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని అక్బర్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అంశు కుమారి నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎన్నోచోట్ల గాలించారు. రెండు రోజుల క్రితం పోలీసులు ఒక యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అంశు కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి ఉన్న దుస్తులు చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. ఆ మృతదేహం నీటిలో దొరికిన కారణంగా ముఖం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. దాంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. అంశు తండ్రి ఆ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇంతలో ఆ తండ్రి మొబైల్‌కు ఒక వీడియో కాల్‌ వచ్చింది.  'నాన్నా.. నేను బతికే ఉన్నాను,   ప్రియుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి వచ్చేశానని, ప్రస్తుతం అత్తవారింట్లో ఉన్నానని' అంటూ అతని కుమార్తె మాట్లాడింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడున్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే పోలీసులకు లభ్యమైన ఆ యువతి మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసులు గుర్తుతెలియన మృతదేహంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలు పెట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)