ఒడిశాలో నది ఒడ్డున స్నానం చేస్తున్న మహిళపై అనూహ్యంగా మొసలి దాడి చేసింది. నీటిలోకి లాక్కెళ్లి తినే ప్రయత్నం చేసింది. మొసలి దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. జాజ్ పూర్ జిల్లా పలట్ పూర్ గ్రామానికి చెందిన జోత్స్నరాణి (35) స్నానం చేసేందుకు బిరూప నది దగ్గరికి వెళ్లింది. నది ఒడ్డున స్నానం చేస్తుండగా.. ఊహించని విధంగా గడ్డి పొద్దల్లో నుంచి ఓ మొసలి వచ్చి దాడి చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, సడెన్ గా వచ్చి అటాక్ చేసింది. మహిళ శరీరం మొత్తాన్ని నోట కరచుకొని నీటిలోకి తీసుకెళ్లింది. మహిళపై మొసలి దాడిని అక్కడే ఉన్న వ్యక్తులు చూసి షాక్ అయ్యారు. గట్టిగా కేకలు వేశారు. ఆమెను కాపాడాలని ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. అంతా చూస్తుండగానే బాధితురాలు మొసలికి ఆహారమైపోయింది. ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న మొసలి దాడి దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. అక్కడ దట్టమైన పొదలు ఉన్నాయి. పొద్దల్లోంచి అకస్మాత్తుగా వచ్చిన భారీ మొసలి.. అనూహ్యంగా మహిళపై దాడి చేసింది. ఆమెను నోట కరుచుకుంది. మొసలి దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ, ప్రయోజనం లేకపోయింది. చావు నుంచి తప్పించుకోలేకపోయింది. మొసలి దాడి గురించి సమాచారం అందుకున్న స్థానికులు.. నదిలో గాలించి మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. మహిళపై మొసలి దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. తమ కళ్ల ముందే మహిళపై మొసలి దాడి చేసి నోటితో కరుచుకుని వెళ్లడం చూసి వణికిపోయారు. వారికి ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి.
మొసలి దాడిలో మహిళ మృతి !
August 16, 2023
0
Tags